WhatsApp : వాట్సప్ లో సరికొత్తగా ఆటోమేటెడ్ ఫీచర్.. ఈ ఫీచర్ ఉపయోగం ఏమిటంటే..?

వాట్సప్( WhatsApp ) తమ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇకపై ఆండ్రాయిడ్ వినియోగదారులు ఖాతాలు, ఛానెల్ లు రెండింటి కోసం స్వయం చాలకంగా నివేదికలను రూపొందించడం కోసం ఈ సరికొత్త ఫీచర్ ఉపయోగపడనుంది.

 The Latest Automated Feature In Whatsapp What Is The Use Of This Feature-TeluguStop.com

ఈ సరికొత్త ఆటోమేటెడ్ ఫీచర్ వాట్సప్ ఖాత యొక్క మరియు ఛానల్ కార్యచరణ గురించి సమాచారాన్ని అందించడం ద్వారా లాంచ్ చేయబడిన తర్వాత ఆటోమేటిక్ గా నెలవారి నివేదికను రూపొందిస్తుంది.

Telugu Channel, Monthly, Technolgy, Whatsapp-Technology Telugu

అంటే వినియోగదారులు ఖాతా మరియు ఛానల్ యొక్క కార్యకలాపాలపై అప్డేట్ కావాలనుకున్న ప్రతిసారి ఈ ప్రాసెస్ ను గుర్తుంచుకొని మ్యానువల్ గా ప్రారంభించాల్సిన అవసరం లేకుండా ఉండేందుకే ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.వినియోగదారుని ప్రమేయం లేకుండా, వినియోగదారుని సమయం మరియు శ్రమను ఆదా చేయడానికి సంబంధిత సమాచారాన్ని సకాలంలో అందించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.అంతేకాదు ఈ ఆటోమేటెడ్ ఫీచ( Automated feature )ర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే.

వినియోగదారులు తమ ఖాతా కోసం రూపొందించిన నెలవారి రిపోర్ట్( Monthly report ) లను పోల్చడం ద్వారా వారి ఖాతా సమాచారం లో మార్పులను సులభంగా ట్రాక్ చేయవచ్చు.వాట్సప్ కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ పై కూడా ఈ ఆటోమేటెడ్ ఫీచర్ పని చేస్తుంది.

Telugu Channel, Monthly, Technolgy, Whatsapp-Technology Telugu

ప్రస్తుతం వాట్సాప్ ద్వారా వాట్సప్ వినియోగదారులకు మాత్రమే మెసేజ్ చేసే అవకాశం ఉంది అని అందరికీ తెలిసిందే.అయితే ఇకపై థర్డ్ పార్టీ మెసేజింగ్ నుండి వచ్చే మెసేజ్ లతో ఇంటరాక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతించడానికి కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది.ఇక ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సప్ వెల్లడించలేదు.వాట్సప్ యొక్క ఈ కొత్త ఫీచర్ యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube