ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలకలం చెలరేగింది.కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్ అవ్వగా ఘోరప్రమాదం చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ సమీపంలో ఉన్న టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్ వల్ల భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు బద్దలవగా, ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారట.కాగా గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఇకపోతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 నుంచి 200 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ప్రమాదం జరిగిన తీరుపై పొల్యూషన్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు విచారణ మొదలు పెట్టారట.
ఈ మధ్యకాలంలో కోనసీమ ప్రాంతంలో తరచూ గ్యాస్ లీకేజ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీ పేలుళ్లు కూడా స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.