కోదాడ ధరణి ఆపరేటర్ ను టర్మినేట్ చేసిన కలెక్టర్...!

సూర్యాపేట జిల్లా:కోదాడ తాహశీల్దార్ కార్యాలయం( Kodada Tahsildar Office )లో ధరణి ఆపరేటర్ గా ఔట్సోర్సింగ్ పద్ధతితో పనిచేస్తున్న కె.

వెంకయ్యను ఉద్యోగం నుండి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్( Collector Tejas Nandlal Pawar ) ప్రకటించారు.

కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన రైతు వీరపనేని కొండలరావు కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన కారణంగా జిల్లా కలేక్టర్ ఆదేశాలనుసారం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణచే విచారణ జరిపి,నిర్దారణ కావడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని కె.వెంకయ్యను విధుల నుండి తొలగింపు (టర్మినేట్) చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

The Collector Who Terminated Kodada Dharani Operator...!-కోదాడ ధర�

Latest Suryapet News