అధికారులకు 11కెవి విద్యుత్ స్తంభం కనిపించడం లేదా...?

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపాలిటీ( Neredcherla Municipality ) పరిధిలోని నరసయ్యగూడెం కాలనీ వ్యవసాయ పొలంలో ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్న 11కేవి విద్యుత్ స్తంభంవిద్యుత్ అధికారులకు( Electricity authorities ) కనిపించడం లేదా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ క్షణమైనా స్తంభం కిందకు పడిపోయి, విద్యుత్ తీగలు నేలకు తాకితే,తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోతున్నారు.

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే రైతులకు ఎలాంటి ప్రమాదం సంభవించక ముందే విద్యుత్ అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

The Authorities Do Not See The 11 KV Electric Pole , 11 KV Electric Pole, Neredc
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News