కథ వినకుండానే హాయ్ నాన్న సినిమాని రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు బాధపడి లాభమేంటి?

నూతన దర్శకుడు శౌర్యువ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం హాయ్ నాన్న ( Hai Naana ) ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని నాని( Nani ), మృణాల్ ( Mrunal ) హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమా మొదటి షో నుంచి కూడా ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 That Mega Hero Rejected Nani Hi Naana Movie, Varun Tej, Lavanya Tripathi , N-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నాని నటించిన తర్వాత నాని మినహాయి సినిమాలోని పాత్రకు ఎవరు సూట్ అవ్వరు అనిపించేలా నాని నటించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.ఈ సినిమాకు ముందుగా దర్శకుడు హీరోగా నానిని ఎంపిక చేయలేదట .డైరెక్టర్ శౌర్యువ్ సోదరుడు నిఖిల్ విజయేంద్ర సింహ నిహారిక మంచి స్నేహితుడు కావడంతో శౌర్యువ్ ముందుగా ఈ సినిమా కథను మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) కు వినిపించాలని కోరుకున్నారట ఈ క్రమంలోనే కథతో వరుణ్ ఇంటికి శౌర్యువ్ వెళ్లగా ఈ హీరో కనీసం కథ కూడా వినకుండా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఇలా వరుణ్ తేజ్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం నాచురల్ స్టార్ నానికి వచ్చిందని చెప్పాలి అయితే వరుణ్ తేజ్ ( Varun Tej ) ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు అప్పటికే ఈయనకు లావణ్య( Lavanya ) తో పెళ్లి కూడా ఫిక్స్ కావడంతో ఈ సినిమా షూటింగ్లో తాను పాల్గొనలేనని తప్పకుండా పెళ్లి సమయానికి ఈ సినిమా తనకు ఇబ్బందిగా మారుతుందన్న ఉద్దేశంతోనే వరుణ్ తేజ్ ఈ సినిమా కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.ఒకవేళ వరుణ్ తేజ్ కనుక ఈ సినిమాలో నటించి ఉంటే ఆయన ఖాతాలో మంచి హిట్ సినిమా పడి ఉండేదని కానీ వ్యక్తిగత కారణాలవల్ల ఇలాంటి మంచి సినిమాని రిజెక్ట్ చేసుకున్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube