జేపీ నడ్డా రాకతో వైసీపీ, టీడీపీ నేతల్లో టెన్షన్..టెన్షన్..

ఏపీలో బీజేపీ పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తున్నారు.బీజేపీ రాష్ట్రంలోని 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను 9 వేల పవర్ సెంటర్లుగా వర్గీకరించి వాటికి ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

 Tension Among Ycp And Tdp Leaders With The Arrival Of Jp Nadda Tension , Ycp-TeluguStop.com

విజయవాడలో రాష్ట్రంలోని పవర్‌హౌస్‌ల ఇన్‌ఛార్జ్‌లతో నడ్డా సమావేశం కానున్నారు.విజయవాడలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మైదానంలో జరిగే శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్నారు.

సాయంత్రం 5 గంటలకు వెన్యూ ఫంక్షన్ హాల్ లో విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా ప్రముఖులతో సమావేశం కానున్నారు.రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారు.

రాత్రి విజయవాడలో బస చేసి రేపు ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని రాజమండ్రి వెళ్తారు.కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశం కానున్నారు.సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని ఢిల్లీకి బయలుదేరుతారు.నడ్డా రాష్ట్ర పర్యటనపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ మీడియాకు తెలిపారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి జనసేనతో పొత్తు ఎలా ఉండాలనేది తమ పార్టీ జాతీయ నేతలు నిర్ణయిస్తారని అన్నారు.

Telugu Delhi, Janasena, Jp Nadda, Narendra Modi, Rajahmundry, Suryanarayana, Vij

ప్రధానిగా నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు.విజయవాడలో సమావేశం కావడం తన అదృష్టమని జేపీ నడ్డా అన్నారు.విజయవాడ అర్జునుడు తపస్సు చేసిన పుణ్యభూమి.

.రాష్ట్రం, దేశం ముందుకెళ్లడానికి అందరి బాధ్యతని తెలిపారు.విజయవాడ శక్తి కేంద్రం ప్రముఖ్‏ను నియమించుకున్నామని.46 వేల పోలింగ్ బూత్లు ఏపీలో ఉన్నాయని అన్నారు జేపీ నడ్డా.రాజకీయాల్లో మార్పు కోసం మనందరం కృషి చేయాలని.విజయవాడ అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతమని జేపీ నడ్డా చేప్పుకోచ్చారు.అయితే అన్ని వర్గాలకు చెందిన పార్టీ బీజేపీ అని జనంలోకి వెళ్లాలని చేప్పారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube