చదువు పూర్తి చేసిన యంగ్ హీరోయిన్... ఇక సినిమాల్లో నటిస్తుందో లేదో...

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “జై చిరంజీవ” చిత్రంలో హీరో మేనకోడలు పాత్రలో నటించి బాగానే అలరించిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ “శ్రీయ శర్మ” సినీ ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది అయితే ఈ దాదాపుగా 20 కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బాగానే అలరించింది.కాగా ఆ మధ్య 2016 వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు “రోషన్” హీరోగా నటించిన “నిర్మలా కాన్వెంట్” అనే చిత్రం ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.

 Telugu Actress Shriya Sharma Completed Degree In Law-TeluguStop.com

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయినప్పటికీ తన చదువులు పూర్తి చేసే పనిలో పడటంతో శ్రీయ శర్మ హీరోయిన్ గా నటించ లేదు.దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన చదువు పై దృష్టి సారించింది.

అయితే ఇటీవలే శ్రీయ శర్మ లా చదువులో డిగ్రీ పూర్తి చేసినట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లకు తెలిపింది.అంతేకాకుండా తన చదువు పూర్తయిన తరువాత ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ని చూపిస్తూ దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

అలాగే లా గ్రాడ్జుయెట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో కొందరు నెటిజనులు ఈ అమ్మడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరికొందరైతే చదువులు పూర్తి అయ్యాయి కదా ఇకపై సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతారా…? లేక తన చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుని సెటిల్ అవుతారా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఈ ప్రశ్నలకు మాత్రం ఇప్పటి వరకూ నటి శ్రీయ శర్మ మాత్రం సమాధానాలు ఇవ్వడం లేదు.

మరి శ్రీయ శర్మ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవుతుందో లేక ఉద్యోగం చూసుకుని ఎటువైపు వెళుతుందో చూడాలి.

Telugu Degree Law, Nirmala, Shriya Sharma, Telugu Actress, Teluguactress, Tollyw

అయితే ఈ విషయం ఇలా ఉండగా మరికొందరైతే ఈ మధ్యకాలంలో నటి శ్రీయ శర్మ బరువు బాగా పెరిగిందని దాంతో సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు నటి శ్రీయ శర్మ తెలుగులో దాదాపు ఇరవైకి పైగా చిత్రాలలో నటించింది అంతేకాకుండా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, భాషలలో కలిపి దాదాపుగా 8 కి పైగా ధారావాహికలలో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube