తెలంగాణకు తెలుగుదేశం పార్టీనే శ్రీరామ రక్ష

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్టానికి తెలుగుదేశం పార్టీనే శ్రీరామ రక్ష అని కోదాడ నియోజకవర్గ టిడిపి(TDP) సభ్యత్వ కమిటీ సభ్యులు ముత్తినేని సైదేశ్వర్ రావు అన్నారు.

సూర్యాపేట జిల్లా మోతె (Suryapet District ,Mote)మండల కేంద్రంలోని టిడిపి ఆధ్వర్యంలో 2024-2026 కు గాను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.మరోసారి తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపితం చేసుకోవడానికి సభ్యత్వాలు అధిక సంఖ్యలో నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు బయ్య నారాయణ,కోడె వాసుదేవరావు,కొండ సోమయ్య,అండెం సైదులు, దోసపాటి రాములు,వెంకట్ రెడ్డి,నారాయణ,వెంకన్న, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలుపరచాలి : యాతాకుల రాజన్న మాదిగ
Advertisement

Latest Suryapet News