‘ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’లో లాస్యప్రియ సంగీతలాలిత్యానికి మురిసిపోయిన హరీష్‌రావు..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్నారు పెద్దలు.భారతీయ సంస్కృతిలో అంతలా మమేకమైపోయింది సంగీతం.

 Telangana Finance Minister Harish Rao Is Moved By Lasya Priya's Musicality In 'a-TeluguStop.com

యుగాలుగా మన సంప్రదాయంలో అంతర్లీనమైన కళ సంగీతం.అన్ని వయసుల వారికీ, అన్నీ వర్గాల వారికీ ఆనందాన్ని పంచుతుంది సంగీతం.

పుట్టుకతో పరిచయమయ్యే సంగీతంలోని భావోద్వేగాలను, దానికి సంబంధించిన అత్యుత్తమ కథనాలను మనసులను గెలుచుకునే రీతిలో ప్రసారం చేస్తోంది ‘ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’.సంగీత ప్రియుల్లో అత్యద్భుతమైన ఆదరణ పొందిన కార్యక్రమం ఇది.సంగీత ప్రముఖులైన శ్రేయా ఘోషల్‌, విశాల్‌ దడ్లానీ, హిమేష్‌ రేష్మియా, జీవీ ప్రకాష్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మెప్పు పొందిన పాటల వేడుక.

వీరందరి లిస్టులోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు.

ఇటీవల ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2లో పార్టిసిపేట్‌ చేసే లాస్యప్రియ ప్రతిభ గురించి రాశారు.

తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’లో అత్యంత ప్రతిభను చూడటం చాలా ఆనందంగా అనిపించింది.లాస్యప్రియ గళం నా చెవుల్లో మారుమోగుతోంది.

ఆమె భవిష్యత్‌ ప్రణాళికలన్నీ సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్‌ చేశారు హరీష్‌ రావు.ప్రజాదరణ పొందిన, ప్రజల మనసులకు దగ్గరైన తెలుగు పాటలను హృద్యంగా ఆలపిస్తూ సంగీతప్రియుల అభిమానాన్ని అందుకుంటున్నారు లాస్యప్రియ.

ఇప్పుడున్న ఏడుగురు కంటెస్టంట్లలో ఆమె ఒకరు.ఆమె పెర్ఫార్మెన్సులు మెచ్చి న్యాయ నిర్ణేతలు ఎప్పటికప్పుడు అభినందనలు చెబుతూనే ఉన్నారు.

శ్రోతల్లోనూ ఆమె గళానికి ముగ్దులవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

అత్యంత ఆదరాభిమానాలతో విరాజిల్లుతున్న ఈ షో దినదినప్రవృద్ధిమానమవుతూ ఉంది.

జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది.ఎంతో మంది బావుందని మెచ్చుకుంటూ ఉన్నారు.

తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రసారమవుతుంది.సంగీతంలో మ్యాజిక్‌ని ఆస్వాదించాలంటే స్టే ట్యూన్డ్ టు ఆహా.మీకు నచ్చిన గళాలను ప్రోత్సహించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube