పార్లమెంట్ లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్ధతు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్ధతు తెలిపింది.గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటర్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లు -2023ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

 Tdp Support For Delhi Services Bill In Parliament-TeluguStop.com

ఈ క్రమంలో ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీలు మద్ధతు తెలిపాయి.దీని ద్వారా ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇది రాజ్యాంగంలోనే ఉందని బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అమిత్ షా వెల్లడించారు.

ఈ బిల్లుపై అభ్యంతరాలు అన్నీ రాజకీయపరమైనవన్న ఆయన విపక్షాల నినాదాల మధ్య సభలో బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.కాగా రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బిల్లు ఉందంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube