పార్లమెంట్ లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్ధతు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్ధతు తెలిపింది.

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటర్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లు -2023ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీలు మద్ధతు తెలిపాయి.దీని ద్వారా ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇది రాజ్యాంగంలోనే ఉందని బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అమిత్ షా వెల్లడించారు.

ఈ బిల్లుపై అభ్యంతరాలు అన్నీ రాజకీయపరమైనవన్న ఆయన విపక్షాల నినాదాల మధ్య సభలో బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కాగా రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బిల్లు ఉందంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

బన్నీ నేషనల్ అవార్డ్ రద్దు చేయాల్సిన అవసరం ఉందా.. అలా చేయడం సాధ్యమేనా?