సర్వేలు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలను యాదాద్రి జిల్లా కలెక్టర్ హానుమంత్ కే.

జెండగే( Hanumant k Zendage ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థుల, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను పరిశీలించి,నూతనంగా పూర్తయిన అదనపు గదులను సందర్శించి అనంతరం విద్యార్థులచే సరదాగా కాసేపు గడిపి, కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడ్డ పిల్లలకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, అలాగే ఇంగ్లీష్ మీడియంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

పిల్లల ఆరోగ్యం,ఎదుగుదలపై దృష్టి పెట్టాలని,ప్రతినెలా ఎత్తు బరువులను పర్యవేక్షిస్తూ సరైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణ,ఎంపీడీవో ప్రమోద్ కుమార్,ఎంపీఓ జనార్దన్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్,కట్ట పాండు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిలో చదివి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు
Advertisement

Latest Video Uploads News