కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు 'సర్వే ' లింక్ ! 

తెలంగాణ అసెంబ్లీ కి పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థుల( Congress candidates ) జాబితాపై ఆ పార్టీ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుంది.ఇప్పటికే ఆశ వాహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది .

 'survey' Link To Select Congress Candidates, Telangana Congress, Pcc, Telangana-TeluguStop.com

స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా కసరత్తు చేస్తోంది.మరి కొద్ది రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ ( Congress )అధిష్టానం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపిక కష్టంగా మారింది.ఈ వ్యవహారం ఇలా ఉండగానే, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలు, సర్వే నివేదికల ఆధారంగానే ఎంపిక చేపట్టాలనే విషయంపై ఇప్పుడు తర్జనభర్జన జరుగుతుంది.

కొంతమంది అభ్యర్థుల విషయంలో ఈ సర్వేను ప్రాతిపదికను తీసుకున్నా,  మిగతా అభ్యర్థుల విషయంలో పార్టీ విధేయత, వారి సీనియర్టి వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలనే వాదన తెరపై వచ్చింది.

Telugu Congress, Manikrao Thakre, Sunil Kanugolu, Telangana-Politics

 సర్వేల ప్రాతిపదికనే అభ్యర్థులు ఎంపిక చేపడుతామని ఏఐసిసి తో పాటు,  టిపిసిసి నేతలు ముందు నుంచి చెబుతూనే వస్తున్నా, ఆ విధంగా చేస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనే వాదన వినిపిస్తోంది.ఢిల్లీలో( Delhi ) జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని,  ఆయా స్థానాల్లో ఒక్క పేరుని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని నేతలు నిర్ణయించుకున్నారు.మరో 35 స్థానాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో,  ఆ స్థానాల్లోనే సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని కొంతమంది నేతలు అధిష్టానానికి ప్రతిపాదించారు.అయితే ఈ ప్రతిపాదన సరికాదని , కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిసార్లు మాత్రమే ఖరారు చేయవచ్చని,  మిగతా చోట్ల సర్వేలతో పాటు , ఇతర కోణాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.దీంతో సర్వేలను పున పరిశీలించడంతో పాటు,  ఆశావాహులతో మాట్లాడి టికెట్లు ఇవ్వలేని నేతలను బొద్దిగించేందుకు ముందుగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Telugu Congress, Manikrao Thakre, Sunil Kanugolu, Telangana-Politics

ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈనెల 28 లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ అవుతుంది.ఈ భేటీ కూడా ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉన్నట్లుగా పిసిసి వర్గాలు చెబుతున్నాయి.ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని సీఈసీ ఆమోదంతో ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube