టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో సుహాస్( Suhas ) ఒకరు కాగా సుహాస్ తాజాగా ఉప్పు కప్పురంబు( Uppu Kappurambu ) అనే క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు.సుహాస్ కీర్తి సురేష్( Keerthy Suresh ) జంటగా ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా డైరెక్ట్ గా థియేట్రికల్ రిలీజ్ లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే సుహాస్ ఈ సినిమాతో పాటు మరో ఆరు సినిమాలలో నటిస్తున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
ఏడాదిలో ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే సుహాస్ టాలెంట్ మామూలు టాలెంట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలు సక్సెస్ సాధించడంతో సుహాస్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.సుహాస్ విలన్ రోల్ లో నటించిన హిట్ 2( Hit 2 ) మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, జనక అయితే గనక, గొర్రె పురాణం, ఆనందరావు అడ్వెంచర్స్, కేబుల్ రెడ్డి సినిమాలతో పాటు ఉప్పుకప్పురంబు సుహాస్ చేతిలో ఉంది.కొన్ని నెలల గ్యాప్ లోనే సుహాస్ సినిమాలు( Suhas Movies ) థియేటర్లలో విడుదలవుతున్నాయి.వరుస సినిమాలతో బిజీగా ఉంటూ సుహాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.సుహాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సుహాస్ పారితోషికం 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.సుహాస్ రాబోయే రోజుల్లో పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.సుహాస్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను పెంచుకుంటున్నారు.సుహాస్ సినిమాలకు డైరెక్షన్ చేయడానికి యంగ్ డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.హీరో సుహాస్ నక్కతోక తొక్కడంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం తెగ వైరల్ అవుతున్నాయి.