విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

సూర్యాపేట జిల్లా:విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

ఆదివారం నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయని,రేపటితరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని,క్రీడాకారులకు, కళాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కబడ్డీ ఆడారు.

క్రీడలు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.గురుకుల పాఠశాల రీజినల్ కో ఆర్డినేటర్ అరుణ కుమారి ఎమ్మెల్యేని మెమోంటోలతో సత్కరించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్,డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి,ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు,జెడ్పిటిసి కవిత నాగరాజు,సర్పంచి గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్,కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పిఈటిలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్
Advertisement

Latest Suryapet News