విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణ

నిధులను వారం రోజులలో పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి మార్చి నెలలో పీఎం శ్రీ 3వ విడత, సమగ్ర శిక్ష 4వ విడత నిధులు వచ్చెలా చూడాలి సమగ్ర శిక్ష, పీఏం శ్రీ పాఠశాలల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కార్యదర్శి రాజన్న సిరిసిల్ల జిల్లా :పీఎం శ్రీ, సమగ్ర శిక్ష క్రింద ఉన్న నిధులను వినియోగిస్తూ విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణి అన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణి మాట్లాడుతూ, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ పథకాల కింద కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జిల్లాలకు విడుదల చేసిన నిధులు వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని, పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వీటిని వినియోగించాలని అన్నారు.జిల్లాలో పీఎం శ్రీ క్రింద ఎంపికైన పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి జరుగుతున్న పనులను సమీక్షించాలని, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా వచ్చే నిధులను వాడుకోవాలని, విద్యార్థులకు మంచి వసతులు కల్పన చేయాలని అన్నారు.

State Education Secretary Dr. Yogita Rana To Create Necessary Infrastructure For

పీఎం శ్రీ, సమగ్ర శిక్ష పథకాల కింద నిధుల వినియోగం చేయకపోతే కేటాయింపులు తగ్గే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిధులను వినియోగిస్తూ అవసరమైన యూసి సర్టిఫికెట్లు పకడ్బందీగా అందించేలా చూడాలని అన్నారు.పాఠశాల స్థాయిలో పీఎం శ్రీ, సమగ్ర శిక్ష కింద అవసరమైన పరికరాలు, సామాగ్రిని కొనుగోలు చేయాలని అన్నారు.

పీఎం శ్రీ క్రింద పాఠశాలలకు రెండవ విడతలో వచ్చిన నిధులను ఖర్చు చేయడంతో పాటు రాబోయే విడుదలలో వచ్చే నిధులను ఎలా వినియోగించాలో ప్రణాళికలు తయారు చేసి పెట్టుకోవాలని, ఇక పై కేంద్రం నుంచి వచ్చే నిధులు అవధులు కోవడానికి వీలు లేదని అన్నారు.ఫిబ్రవరి నెలలో నిధులు ఖర్చు చేసి వివరాలను సమర్పిస్తే, మార్చ్ మొదటి లేదా రెండో వారంలో మూడవ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

సమగ్ర శిక్ష కింద ఉన్న నిధులు ఖర్చు పెడితే 4వ విడత నిధులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, సంబంధిత విద్యా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వీడియో: జీరో గ్రావిటీలో జపాన్ ఆస్ట్రోనాట్ బేస్‌బాల్.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే..
Advertisement

Latest Rajanna Sircilla News