Heroine Anshu : ప్రతి సినిమాలో చనిపోయే క్యారెక్టర్లు ఇస్తున్నారని తెలుగు సినిమాలని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్…

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నటులు ఏదైనా క్యారెక్టర్ చేస్తే వాళ్ళకి వరుసగా అలాంటి క్యారెక్టర్ లనే ఆఫర్ చేస్తూ వాళ్ళను అందులోనే పరిమితం చేస్తూ ఉంటారు.అందుకే చాలామంది హీరోలు గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ ఒకే రకమైన పాత్రలను కాకుండా డిఫరెంట్ పాత్రల్లో నటించడానికి సిద్దమవుతు ఉంటారు.

 Star Heroine Anshu Who Rejected Telugu Movies Saying That Characters Die In Eve-TeluguStop.com

ఇక ఇండస్ట్రీ లో అన్ని రకాల పాత్రలు పోషించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు.

కాబట్టి ఒకసారి ఒక నటుడు ఏదైనా పాత్ర చేశాడంటే సరిగ్గా అలాంటి పాత్ర నే వాళ్ళకి మిగతా సినిమాల్లో కూడా ఇస్తూ ఉంటారు.

 Star Heroine Anshu Who Rejected Telugu Movies Saying That Characters Die In Eve-TeluguStop.com

ఇలాంటి నేపథ్యంలోనే ఒక హీరోయిన్ కి( Heroine ) వరుస సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్ లని ఇస్తున్నారనే ఉద్దేశ్యంతో తను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన విషయం చాలామందికి తెలియదు.

Telugu Anshu, Characters Die, Manmadhudu, Raghavendra, Telugu-Movie

ఆమె ఎవరు అంటే ప్రభాస్ తో రాఘవేంద్ర,( Raghavendra Movie ) నాగార్జునతో మన్మధుడు( Manmadhudu ) సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అన్షు.( Heroine Anshu ) ఈమె ఈ రెండు సినిమాల్లో కూడా తను సెకండ్ హీరోయిన్ గా నటించడమే కాకుండా రెండు సినిమాల్లో తన క్యారెక్టర్ చనిపోతుంది.దాంతో తనకి మరో రెండు మూడు సినిమాల్లో కూడా సేమ్ అలాంటి క్యారెక్టర్లు రావడంతో విసిగిపోయిన తను సినిమాల్లో నటించడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్ అని తను సినిమా ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకోని లైఫ్ లో సెటిల్ అయింది.

Telugu Anshu, Characters Die, Manmadhudu, Raghavendra, Telugu-Movie

ఇక మొత్తానికైతే ఒక స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఆమె తనకి సరైన క్యారెక్టర్ రావడం లేదనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…ఇప్పటికైన ఇండస్ట్రీలో టాలెంట్ ను బట్టి క్యారెక్టర్లు ఇస్తే బాగుంటుంది ఒక క్యారెక్టర్ బాగా చేశారని ఆ నటులను అదే క్యారెక్టర్ లో పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube