ధాన్యం దిగుమతులను వేగవంతం చేయండి: కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా: ధాన్యం దిగుమతులలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని మిల్లర్లను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి వద్దగల నాగార్జున ఫార బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యాన్ని వెంటనే మిల్లులలో దిగుమతులు అయ్యేలా మిల్లుల యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు.మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను పెంచి వేగంగా ధాన్యం దిగుమతులు అయ్యేలా చూడాలన్నారు.

Speed ​​up Grain Imports Collector S Venkatarao, Grain Imports, Collector S

జిల్లా ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని,మిల్లుల వద్ద సివిల్ సప్లై అధికారులు త్వరగా దిగుమతులయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.ఇప్పటి వరకు మిల్లులో 38 వేల బస్తాలు దిగుమతి చేసుకోవడం జరిగిందని మిల్లు యజమాని కొత్త ఆంజనేయులు కలెక్టర్ కు తెలిపారు.

తమ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో దిగుమతులు పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఎస్ఓ పుల్లయ్య, డిటిసిఎస్ నాగలక్ష్మి,ఆర్ఐ హాసన్ మహ్మద్,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News