పిడుగుపాటుకు ఆరు మేకలు మృతి,మరో ఆరు వాగులో గల్లంతు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

ఈ నేపథ్యంలో మండలంలోని ముసి ఒడ్డు తండా గ్రామంలో పిడుగుపాటుకు 12 మేకలు మృతి చెందాయని మేకల యజమాని బానోతు బాలు కుటుంబం బోరున విలిపించింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.మూసీ వాగు పరివాహ ప్రాంతాలలో రోజువారీగా మేకలు మేపడానికి వెళ్లారు.

మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో మేకలు పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్లాయి.ఈ సమయంలో పిడుగు పడడంతో 6 మేకలు అక్కడే మృతి చెందగా మరో 6 మేకలు వాగులో గల్లంతయ్యాయి.

సుమారు 2 లక్షలు వరకు నష్టం వాటిలిందని,ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.మృతి చెందిన మేకలను నేరేడుచర్ల ఆర్ఐ పరిశీలించారు.

Advertisement

Latest Suryapet News