చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే ముందుంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్ ఖోఖో తెలంగాణ రాష్ట్ర సెలక్షన్ ట్రయల్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 Minister Komatireddy Venkatareddy Should Excel In Sports As Well As Studies , Mi-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ స్థాయి సెలక్షన్స్ కు నిర్వహిస్తున్న ట్రయల్స్ లో క్రీడాకారులందరూ రాణించాలని,గతంలో తెలంగాణకు ఈ క్రీడల్లో సిల్వర్ మెడల్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడా రంగంలో ముందుంచేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని,ఇందులో భాగంగా గచ్చిబౌలిలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ ఒలంపిక్స్ లో రాష్ట్రం ముందుండే విధంగా చూస్తున్నదని చెప్పారు.

ఆటో డ్రైవర్ కుమారుడైన టాప్ బౌలర్ సిరాజ్ కు ప్రభుత్వం తరఫున గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు, 500 గజాల స్థలాన్ని,అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని రాణించాలని కోరారు.

జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ పథకాల్లో చివరి నుండి రెండో స్థానంలో ఉందని,సౌత్ కొరియా లాంటి చిన్న దేశం రెండు వందల మెడల్స్ సాధిస్తే మన దేశం రెండు మెడల్స్ సాధించడం బాధాకరమైన విషయమన్నారు.ప్రతి ఒక్కరికి చదువు ఎంత ముఖ్యమో,ఆటలు కూడా అంతే ముఖ్యమని, చదువుతో పాటు ఆటలపై శ్రద్ధ చూపిస్తే శారీరకంగా, మానసికంగా సామర్ధ్యాలను కలిగి ఉంటారన్నారు.

ఉమెన్ ఖోఖో క్రీడాకారులకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున ట్రాక్ సూట్ కొనుగోలుకై రెండు లక్షల రూపాయల ఇస్తున్నట్లు ప్రకటించారు.రాష్ట్రస్థాయిలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అనంతరం నెల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,ఖేలో ఇండియా ఉమెన్ ఖోఖో జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డిఓ శ్రీదేవి,డిఎస్పీ శివరామిరెడ్డి,మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube