పనస పండులో ఉండే పనస గింజలను చాలా మంది ఇష్టపడుతుంటారు.ఈ గింజలను ఉడికించుకుని కొందరు, కాల్చుకుని కొందరు, కూర వండుకుని మరికొందరు తింటుంటారు.
ఎలా తిన్నా పనస గింజల రుచి అద్భుతంగా ఉంటుంది.రుచే కాదు.
విటమిన్ బి, కాల్షియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, థయామిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు పనస గింజల్లో ఉంటాయి.అందుకే ఈ గింజలు ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించగలవు.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ పనస గింజలను అతిగా తింటే మాత్రం అనేక సమస్యలను తెచ్చి పెడతాయి.ముఖ్యంగా పనస గింజలకు రక్త పోటును తగ్గించే గుణం ఉంది.
అధిక రక్తపోటుతో బాధ పడే వారికి ఇవి వరమే కావొచ్చు.కానీ, లో బీపీతో ఇబ్బంది పడే వారు మాత్రం పనస గింజలకు దూరంగా ఉండాలి.
లేదంటే రక్త పోటు స్థాయిలు మరింత తగ్గి.ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు మందులు వాడుతున్నారు.అలాంటి వారు కూడా పనస గింజలు తినరాదు.ఎందుకంటే, పనస గింజలు రక్తాన్ని మందం అయ్యేలా చేస్తాయి.దాంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.జీర్ణ సమస్యలను నివారించడంలో పసన గింజలు గ్రేట్‌గా సహాయపడతాయి.
కానీ, అవే గింజలను అతిగా తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తెచ్చిపెడతాయి.ఇక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి పనస గింజలకు ఉంది.అందుకే షుగర్ లెవల్స్ తగ్గించే మందులను వాడుతున్న మధుమేహం వ్యాధి గ్రస్తులు పనస గింజలకు దూరంగా ఉండాలి.
లేకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువగా పడి పోతాయి.