ఎస్సీ వర్గీకరణ చెయ్ గ్రామాల్లో అడుగేయ్

సూర్యాపేట జిల్లా:ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు బీజేపీ నేతలను గ్రామాలకు రానివ్వమని ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ యాతాకుల రాజన్న మాదిగ హెచ్చరించారు.

గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద మహాజన సోషలిస్టు పార్టీ,ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకోసం మహాజన నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 28 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తుంటే,వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాటను విస్మరించిన బీజేపీ,ఆర్ఎస్ఎస్ గుండాలు, జులై 3 న హైదరాబాదులో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని,దాడి చేసిన దోషుల పక్షాన బీజేపీ నాయకత్వం బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

SC Classification In Chey Villages-ఎస్సీ వర్గీకరణ చ�

లేనిపక్షంలో బీజేపీని ఏ గ్రామానికి వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు.ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ,నాయకులు యర్రా వీరస్వామి,బోడ శ్రీరాములు,ములకలపల్లి రవి మాదిగ,దాసరి వెంకన్న మాదిగ,పుట్టల మల్లేశం మాదిగ,చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ,మారపల్లి సావిత్ర ప్రభాకర్ మాదిగ,మిర్యాల చిన్ని,వెంకటేష్ మాదిగ,బోజ్జా వెంకన్న,చింత వినయ్ బాబు మాదిగ,చెరుకుపల్లి సతీష్ మాదిగ,మిద్దె శ్రావణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News