మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఆచార్య.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా భారీ బిజినెస్ తో రిలీజ్ కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
నిర్మాతకన్నా ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టపోయారు.ఇదిలాఉంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయి.
థియేటర్ లోనే కాదు డిజిటల్ రిలీజ్ లోనూ ఆచార్యకు బ్యాడ్ లక్ ఎదురైంది.
ఇదిలాఉంటే ఆచార్య సినిమాను ఓ ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ ఛానెల్ శాటిలైట్ రైట్స్ తీసుకోగా.
ఆ సినిమా తమ ఛానెల్ లో రిలీజ్ చేయాలంటే కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు.అదేంటి అంటే థియేట్రికల్, డిజిటల్ రెండిటిలో ఫ్లాప్ అయిన ఆచార్య సినిమాలో కొన్ని మార్పులను సూచిస్తున్నారట.
సినిమాలో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది.అయితే ఆమె మ్యారేజ్ వల్లో లేక మరేమో కానీ సినిమా నుంచి ఆమె పోర్షన్ మొత్తం లేపేశారు.

కాజల్ కి ఏదో సర్ధి చెప్పగా థియేటర్ లో కాజల్ లేదని తెలిసి ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.కాజల్ పాత్ర ఉంటే రిజల్ట్ లో కూడా తేడా ఉండేదని టాక్.అందుకే శాటిలైట్ షోలో ఆచార్యలో కాజల్ సీన్స్ యాడ్ చేస్తున్నారని టాక్.అలా చేస్తేనే శాటిలైట్ డీల్ అనుకున్నట్టుగా ఉంటుందని లేకపోతే తిరిగి రెండున్నర కోట్లు ఇవ్వాలని ఆ శాటిలైట్ టీవీ వారు డిమాండ్ చేశారట.
ఆ డబ్బు తిరిగి ఇవ్వడం కన్నా కాజల్ సీన్స్ యాడ్ చేయడం బెటర్ అని అలా ఫిక్స్ అయ్యారట.సో ఆచార్య టీవీలో వస్తే మాత్రం అందులో కాజల్ ఉంటుందని మాత్రం తెలుస్తుంది.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.







