వెబ్ సిరిస్ కి ఏకంగా బల్క్ డేట్స్ ఇచ్చేసిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని ఇంటి కోడలు సమంత ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకి దూరమై సోలోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది.నటిగా తనని తాను ప్రూవ్ చేసుకొని టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని సమంత భావిస్తుంది.

 Samantha Ready To Act In Web Series-TeluguStop.com

ఇందులో భాగంగా ఇప్పటికే ఓ బేబీ సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని ఇక వరుసగా వీలైనంత వరకు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయి ఉంది.ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి సమంత 96 రీమేక్ మూవీలో నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత సినిమాలతో పాటు ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరిస్ లపై కూడా ద్రుష్టి పెట్టింది.

ఇప్పటికే కాజల్ తో పాటు బాలీవుడ్ లో చాలా మంది భామలు వెబ్ సిరిస్ ల మీద ద్రుష్టి పెట్టి వాటిలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.తాజాగా సమంత ఓ వెబ్ సిరిస్ కోసం అమెజాన్ ప్రైమ్ కి ఏకంగా 40 రోజులు బల్క్ కాల్షీట్స్ ఇచ్చేసినట్లు సమాచారం.

ఇక లేడీ ఓరియంటెడ్ గా తెరకేక్కే ఈ వెబ్ సిరిస్ లో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలని సామాజిక కోణంలో టచ్ చేసి చెప్పే ప్రయత్నం జరుగుతుందని, ఈ ఎలిమెంట్ నచ్చి సమంత వెబ్ సిరిస్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube