ఏపీలో ప్రస్తుతం ఉద్యోగాల పండుగ వచ్చింది.వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలో ప్రతి ఎబ్భై కుటుంబాలకి ఒక గ్రామ వాలంటీర్ చూప్పున నియమించి నవరత్నాలు అన్ని పక్కాగా ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం మొదలెట్టిన జగన్ ఆ ప్రక్రియని పూర్తి చేసారు.
ఇప్పుడు గ్రామ వాలంటీర్ల నియామకం జరిగిపోయింది.ఇదిలా ఉంటే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులైన వారికి పోస్టులు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకి, వారికి కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చుకున్నారని విమర్శలు వినిపించాయి.
వైసీపీ నేతలు బయటకి పారదర్శకత అంటున్న లోపల అంతా తమ వారికే పోస్టులు కట్టబెట్టారని బహిరంగంగా విమర్శలు వినిపించాయి.చాలా చోట్ల ఉద్యోగం పొందని వారి ఆందోళన కూడా చేసారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా విజయసాయి రెడ్డి కూడా ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తుంది.తాజాగా వైసీపీ సోషల్ మీడియాలో విభాగంతో జరిగిన సమావేశాలలో విజయసాయి రెడ్డి వారితో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ పోస్టులు అన్ని వైసీపీ కార్యకర్తలకే ఇవ్వడం జరిగిందని చెప్పినట్లు సమాచారం.
నేరుగా పోస్టులు వైసీపీ కార్యకర్తలకి ఇచ్చేస్తే చాలా మంది కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్లాన్ ప్రకారం ఇంటర్వ్యూలు పెట్టి వారికి ముందే సమాచారం ఇచ్చి అలా వైసీపీ కార్యకర్త అని నిర్ధారించుకున్న తర్వాతనే ఇవ్వడం జరిగిందని చెప్పినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఇలా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటాం అని ముందే చెబితే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేవాళ్ళం కాదు కదా అని ఇప్పుడు చాల మంది నిరుద్యోగులు అంటున్నారు.