మేకప్ వేసుకున్న విజయశాంతి! ఆకాశానికి ఎత్తేసిన దర్శకుడు

నటి విజయ శాంతి.హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కెరియర్ లో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు చిరంజీవి, కృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది.

 Vijayashanthi Wear Makeup For Sarileru Neekevvaru-TeluguStop.com

ఇక చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ కి అప్పట్లో మంచి గుర్తింపు ఉంది.చిరంజీవితో పోటీ పడి డాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటి వరుస విజయాలు అందుకుంది.

అలాగే తెలుగులో స్టార్ హీరోలకి పోటీగా తాను కూడా హీరోయిజం చూపించి మెప్పించింది.

ఇక చాలా కాలం క్రితం వైజయంతి అనే మూవీ తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న విజయశాంతి రాజకీయాలలో బిజీ అయిపోయారు.

మొదట్లో బీజేపీ పార్టీలో చేరి, తరువాత తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టి ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసింది.కొంత కాలం ఆ పార్టీలో కొనసాగిన, కేసీఆర్ తనకి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి కాంగ్రెస్ గూటికి వచ్చింది.

ఇక గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరువాత స్టార్ క్యాంపెయినర్ గా పార్టీని నడిపించిన అధికారంలోకి తీసుకురాలేకపోయింది.

మేకప్ వేసుకున్న విజయశాంతి! ఆక

ఇదిలా ఉంటే దశాబ్దం తర్వాత మరల విజయశాంతి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

ఇక తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతికి సంబంధించిన సన్నివేశాలు షూటింగ్ మొదలెట్టాడు.ఈ సందర్భంగా ఆమె మేకప్ వేసుకుంటున్న ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేసి అప్పటికి, ఇప్పటికి ఆమెలో ఉన్న కమిట్మెంట్, డెడికేషన్ అలాగే ఉంది ఏ మాత్రం మారలేదు.

ఇట్స్ మేకప్ టైం అంటూ పోస్ట్ పెట్టాడు.దీనికి దేవిశ్రీ కూడా స్పందిస్తూ వెల్ కమ్ చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube