మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్‌ను తిరిగి వీలైనంత త్వరగా ప్రారంభించి, సినిమాను కూడా అంతే త్వరగా పూర్తి చేయాలని చిత్ర డైరెక్టర్ కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాలం’ను తెలుగులో రీమేక్ చేయాలని చిరు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను మాస్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్‌కు అప్పగించాడు చిరు.ఇక ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తుండగా, ఆయన సోదరిగా ఓ స్టార్ బ్యూటీని చిత్ర యూనిట్ కన్ఫం చేసింది.
ఫిదా బ్యూటీ సాయి పల్లవిని చిరు సోదరి పాత్రలో తీసుకోవడంతో ఆమె ఈ పాత్రలో ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి అప్పుడే చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.ఇక ఈ సినిమాలో సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నాడు.మరి ఈ సినిమాలో సాయి పల్లవి, చిరు కాంబోలో రాబోయే సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అనే అంశం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
అటు ఆచార్య చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిరు అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.