అన్ని బీసీ కులాల వారికి రూ.లక్ష మంజూరు చేయాలి: ధూళిపాళ్ల

సూర్యాపేట జిల్లా

: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని,కాగా కేవలం కులవృత్తుల వరకే కాకుండా అన్ని బీసీ కులాలకు ఈ పథకం వర్తింపజేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ నేతలతో కలిసి మాట్లాడుతూ బీసీ కులాల్లో( BC Castes ) అనేక కులాల వారికి ప్రత్యేకమైన వృత్తులు లేవని,వృత్తులు లేని చాలా కులాలు ఉన్నాయని,మున్నూరు కాపులు,పెరిక లాంటి దాదాపు 20 కులాల వారికి వ్యవసాయం,చిరు వ్యాపారం లాంటి వృత్తిలో జీవిస్తున్నారని,వారికి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, ప్రస్తుత పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయం చేసే దిశగా ఆలోచన చేయకపోవడం బాధాకరమని,ప్రత్యేక వృత్తి లేని కులాల వారిని గుర్తించి,వారికి నైపుణ్యం ఉన్న రంగాలలో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తగు ప్రోత్సాహం అందించాలని,తద్వారా బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయని,కేవలం ఎన్నికల కోసం ఓట్ల రాజకీయం చేయడం తగదని,బీసీలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసి అందరికీ తగు సహాయం అందించాలని కోరారు.

అలాగే బీసీ జన గణన చేసేందుకు తెలంగాణ అసెంబ్లీలో( TS Assembly ) తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని,కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోయినప్పటికీ,హైకోర్టు ( High court )అనుమతి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలని, తెలంగాణ ప్రభుత్వం గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టాలని,ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన బీసీ,ఎస్టీ,ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలలో నిరుపేదలను కూడా గుర్తించి ప్రభుత్వం తగువిధంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో.

అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్( AIYF ) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను( Chilaka Raju srinu ) పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News