Nayanthara : కోపంతో నయనతారను రావొద్దని చెప్పా.. పార్థిబన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లు నటీనటులు మొదట్లో అవకాశాల కోసం తిరగాల్సిందే ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కోవాల్సిందే.అలా మొదట్లో కష్టాలను అనుభవించిన వారిలో లేడీ సూపర్ స్టార్.

 Parthiban Reject Nayanthara His Movie-TeluguStop.com

నయనతార ఒకరు.ఒకప్పుడు నయనతార( Nayanthara ) కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంది.

పురుషాధిక్యత అధికం అని చెప్పబడే ఈ సినిమా రంగంలో నయనతార ఆరంభకాలంలో పలు అవమానాలను ఎదుర్కొని మానసిక వేదనలను అనుభవించింది.

Telugu Kollywood, Nayanthara, Hiban, Reject-Movie

అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని టాలీవుడ్( Tollywood ) తో పాటు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.మొదటగా అయ్యా సినిమాతో కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా కంటే ముందు పార్థిపన్‌ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన కొడైకుల్‌ మళై ( Kodaikul Malai )చిత్రం ద్వారా పరిచయం కావలసి ఉంది.

అయితే ఆమెను పార్థిబన్‌ రావొద్దని చెప్పారట.ఈ సంఘటన గురించి ఆయన ఇటీవల ఒక భేటీలో చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నయనతార ఫొటో ఒకటి చూసి తాను దర్శకత్వం వహించనున్న కొడైకుల్‌ మళై చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాను.

Telugu Kollywood, Nayanthara, Hiban, Reject-Movie

దీంతో కేరళకు చెందిన నయనతారను ఒక రోజు ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పాను.అయితే ఆమె ఆ రోజు రాకుండా, మరుసటి రోజు ఫోన్‌ చేసి నిన్న రాలేకపోయానని, ఈ రోజు బస్సు ఎక్కి రేపు ఉదయం కచ్చితంగా వస్తాను అని చెప్పింది.నేను కోపంతో ఆమెను రావద్దు అని చెప్పాను.అలా కేరళ నుంచి బస్సులో వస్తాను అని చెప్పి నాయనతార ఈ విధంగా లేడీ సూపర్ స్టార్ గా ఇంతటి స్థాయికి ఎదగడం నిజంగా సంతోషకరం అని తెలిపారు.

కాగా టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నయనతార, ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube