వృత్తి కులాలకు లక్షసాయం చారిత్రాత్మకం:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:వృత్తి కులాలకు లక్ష సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా వృత్తి కులాలన్నింటికీ రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.బుధవారం ప్రభుత్వం నిర్ణయాన్ని హర్షిస్తూ సూర్యాపేట జిల్లా మేదర సంఘం ప్రతినిధులు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 One Lakh Ruppes Financial Help Is Historic For Professional Castes Minister Jaga-TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం వృత్తుల వికాసానికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని,కుల సంఘాల నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 కు ముందు అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆరే అన్నారు.

కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిందని చెప్పారు.దీన్ని ప్రతి ఒకరూ వినియోగించుకోవాలని కోరారు.

మేదరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని,కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సహంతో మేదర సోదరులు వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకుని ఆర్దికంగా వృద్ది చెందాలని ఆకాంక్షించారు.ఇప్పటికే మేదరులకు వెదురుతో గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పించిందన్నారు.

కొద్ది మందికి రుణాలను కూడా మంజూరు చేసిందని, అదేరీతిన మిగతా కులవృత్తుల అభ్యున్నతికి కూడా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, మేదార సంఘం ప్రతినిధులు యాదగిరి, మల్లయ్య,తిరుపతయ్య, వెంకన్న,మల్లేశం,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube