గుండాలలో గంజాయి కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలోని అనంతారం -బురుజుబావి గ్రామాల పరిధిలోని బుధవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించడంతో విచారించగా గంజాయి (600గ్రా)లతో పట్టుపడ్డాడని గుండాల ఎస్సై యాకన్న తెలిపారు.వెల్మజాల గ్రామానికి చెందిన సింగారం నాగరాజు(21)తండ్రి వెంకన్న గత రెండు సంవత్సరాలుగా భద్రాచలం పరిధిలోని సీలేరు గ్రామానికి చెందిన సోమరాజు అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని గంజాయిని వాడుతున్నట్లుగా నిందితుడు చెప్పాడని,

 Police Caught Cannbis At Gundala Mandal, Police ,cannbis ,gundala Mandal, Yadadr-TeluguStop.com

భద్రాచలం,తొర్రూరు, జనగాం జిల్లాల పరిధిలోని వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నాడని,జనగాం జిల్లాకు బార్డర్ లో ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని కోమ్మాయిపల్లి, మరిపడిగ,బండ కొత్తపెళ్లి, గంగాపురం,పలు గ్రామాలలో అనుమానాస్పదంగా కొంత వ్యక్తులు తిరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టితో గస్తీ చేపడుతున్నామని,ఆ క్రమంలోనే గంజాయి సరఫరా వ్యక్తి దొరకడంతో అరెస్టు చేసి,ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.

సోమరాజు అనే వ్యక్తి కొరకు ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube