Robert Hur : ఎన్నికల వేళ డెమొక్రాట్లకు చిక్కులు.. బైడెన్ క్లాసిఫైడ్ డాక్స్ కేసులో కమిటీ ముందుకు రాబర్ట్ హుర్

డొనాల్డ్ ట్రంప్( Donald Trum ) హయాంలో నియమితులైన అమెరికా మాజీ అటార్నీ రాబర్ట్ హుర్( Robert Hur ) ప్రైవేట్ పౌరుడిగా హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు హాజరుకానున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌కు చెందిన డెలావేర్ ఇంటిలోనూ , వాషింగ్టన్ డీసీలోని కార్యాలయంలోనూ క్లాసిఫైడ్ మెటీరియల్‌ను అధికారులు గుర్తించినప్పటికీ బైడెన్‌పై విచారణ జరిపేందుకు హుర్ నిరాకరించారు.

 Robert Hur Set To Testify On Joe Bidens Classified Docs Case As Private Citizen-TeluguStop.com

ఇండిపెండెంట్ ప్రకారం.ఒహియో ప్రతినిధి జిమ్ జోర్డాన్ నేతృత్వంలోని రిపబ్లికన్ మెజారిటీ అభ్యర్ధన మేరకు హుర్ జ్యుడిషియరీ కమిటీ ముందు హాజరుకానున్నారు.

జ్యుడీషియరీ కమిటీ మూలాల ప్రకారం.ప్రత్యేక న్యాయవాది ప్రభుత్వ సేవ నుంచి ఈ సమయంలో వైదొలగడం ప్యానెల్‌లోని డెమొక్రాట్‌లకు విషమ పరిస్థితిని తెచ్చిపెట్టింది.

Telugu Democrats, Donald Trump, Joe Biden, Robert Hur, Roberthur, Dispatch, Wash

విచారణను ఎదుర్కోవడానికి గాను వాషింగ్టన్‌లోని ప్రముఖ న్యాయవాది విలియం బర్క్‌( William Burk )ను హుర్‌ ఆశ్రయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.బర్క్.మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్, గతంలో మీడియా పర్సనాలిటీ మార్తా స్టీవర్ట్‌ను ప్రాసిక్యూట్ చేసిన బృందంలో పనిచేశాడు.రిపబ్లికన్ రాజకీయ వర్గాల్లో ఆయనకు మంచి అనుబంధం వుంది.హుర్, బర్క్ ఏనాడూ కలిసి పనిచేయలేదు.జ్యుడిషియరీ కమిటీ ప్రకారం.

వారిద్దరూ రిపబ్లికన్ పక్షపాతులుగా పేరొందారు.కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు ట్రంప్ హయాంలో న్యాయశాఖ ప్రతినిధిగా పనిచేసిన సారా ఇస్గుర్ నుంచి సలహా తీసుకోవాలని హుర్ నిర్ణయించుకున్నారు.

Telugu Democrats, Donald Trump, Joe Biden, Robert Hur, Roberthur, Dispatch, Wash

దీనిపై డెమొక్రాట్లు( Democrats ) ఆందోళన చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది.ఇస్గుర్ గతంలో అప్పటి అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్‌కు నాయకత్వం వహించారు.డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలోని చివరి సంవత్సరాల్లో ఆమె డిపార్ట్‌మెంట్‌ను విడిచిపెట్టారు.ప్రస్తుతం ‘‘ The Dispatch ’’కు సీనియర్ ఎడిటర్‌గా , ఏబీసీ న్యూస్‌కు పెయిడ్ కంట్రిబ్యూటర్‌గా ఇస్గుర్ విధులు నిర్వర్తిస్తున్నారు.

అమెరికాలో మరికొద్దినెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో హుర్ వ్యవహారం బైడెన్‌కు రాజకీయంగా తలనొప్పులు తెచ్చే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube