₹2000 నోట్ పై మరొక కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..!!

RBI Made Another Key Announcement On 2000 Rupees RBI, 2000 Rupees Note , Reserve Bank Of India , Exchange Deposits , Announcement , Central Govt

మూడు వారాల క్రితం భారతీయ రిజర్వ్ బ్యాంక్( Reserve Bank of India ) 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ కీలక ప్రకటన జారీ చేయడం తెలిసిందే.ఇకపై ₹2000 నోట్లు సర్కులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 Rbi Made Another Key Announcement On 2000 Rupees Rbi, 2000 Rupees Note , Reserve-TeluguStop.com

అదే సమయంలో ఎవరి వద్దనైనా ఈ నోట్లు ఉంటే మే 23 నుంచి అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్.బి.ఐ రీజినల్ బ్రాంచ్ లలో మార్చుకోవచ్చని సూచించింది.సెప్టెంబర్ 30 వరకు ఎక్స్చేంజ్ డిపాజిట్ల( Exchange Deposits )కు అవకాశం ఉంటుందని తెలిపింది.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఆర్బిఐ 2000 నోట్ల మార్పిడి పై కీలక ప్రకటన చేసింది.నోట్ల మార్పిడికి సంబంధించి గడువు పెంచే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు 50 శాతం ₹2000 నోట్లు వెనక్కి వచ్చాయని స్పష్టం చేయడం జరిగింది.వీటిలో 85% డిపాజిట్ల రూపంలో… 15% నోట్ల ఎక్స్చేంజ్ జరిగిందని ఆర్.బి.ఐ వెల్లడించింది.అయితే మార్పిడి విషయంలో ఎన్నారై లకు వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.సెప్టెంబర్ 30 వరకు నోట్ల మార్పిడికి ఆర్బిఐ గడువు ఇవ్వటం జరిగింది.కాగా ఇటీవల ₹2000 నోట్ల మార్పిడి విషయంలో ఆర్బిఐ గడువు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి.ఈ క్రమంలో అటువంటివి ఏమీ లేవని సెప్టెంబర్ 30 చివరి తేదీ అని మరోసారి ఆర్.బి.ఐ క్లారిటీ ఇవ్వటం జరిగింది.ఎట్టి పరిస్థితుల్లో 2000 నోట్లు మార్పిడికి గడవు పెంచే అవకాశాలు లేవని క్లారిటీ ఇవ్వటం జరిగింది.

RBI Made Another Key Announcement On 2000 Rupees RBI, 2000 Rupees Note - Telugu Rupees #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube