బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మాస్ డైరెక్షన్ లో శ్రీ లీల రామ్ పోతినేని జంటగా వచ్చిన స్కంద సినిమా డివైడ్ టాక్ తో మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది.ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని అందర్నీ అలరించింది.
ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్స్ తో పాటు లవ్ రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఉండడంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు.ఇక మొదటి రోజే హిట్ టాక్ రావడంతో స్కంద ( Skanda Movie ) ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే ఈ సినిమాలో బంగారం లాంటి అవకాశాన్ని ఆ హీరోయిన్ మిస్ చేసుకుందట.
శ్రీ లీల (Sreeleela) స్థానంలో ముందుగా బోయపాటి శ్రీను వేరే హీరోయిన్ ని అనుకున్నారట.కానీ ఆ హీరోయిన్ మాత్రం తనకి ఈ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వదని తప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఇక రామ్ పోతినేని( Ram Pothineni ) ప్లేస్ లో కూడా ముందుగా అల్లు అర్జున్ ( Allu Arjun ) ని అనుకున్నట్టు వార్తలు వినిపించాయి.
ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్లో బిజీ ఉండడం వల్ల స్కంద సినిమా ని రిజక్ట్ చేశారట.ఇక అల్లు అర్జున్ లాగే హీరోయిన్ ఛాన్స్ ని కూడా మిస్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika mandanna ) .శ్రీ లీల స్థానంలో ముందుగా రష్మిక మందన్నా కే అవకాశం వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసిందట.
కానీ ప్రస్తుతం సినిమా రిలీజై సూపర్ హిట్ అవడంతో అరెరే మంచి ఛాన్స్ వదిలేసుకొని పెద్ద తప్పు చేశానే అంటూ కాస్త బాధ పడుతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ఏది ఏమైనప్పటికీ ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం.