ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గురించి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.

 Ram Charan Ntr Rajamouli Rrr Film Oscars 2023 In The Front Runner-TeluguStop.com

చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమా ద్వారా రాజమౌళి కలిపి చరిత్ర సృష్టించారు.ఈ విధంగా స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా థియేటర్లో రన్ అవుతూ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.థియేటర్లోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టించి హాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలబడింది.

ఇకపోతే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా.రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను తిరిగి రాయడమే కాకుండా తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Telugu Oscars, Rajamouli, Ram Charan, Rrr, Rrr Oscars-Movie

చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గెలుపొందడం సామాన్యమైన విషయం కాదు.ఆస్కార్ బరిలో నిలవాలన్నా కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలబడి మరో రికార్డును సొంతం చేసుకుంది.

భారతదేశం నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా నిలవడం విశేషం.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రకటించడంతో తెలుగు సినీ ప్రేమికులు ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube