ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: వర్షాకాలం దృష్ట్యా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజ నంద లాల్ పవార్ అన్నారు.

బుధవారం సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిని పరిశీలించి వార్డు వార్డు తిరుగుతూ రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకొని డాక్టర్లకు పలు సూచనలు చేశారు.

విష జ్వరాలతో పాటు డెంగ్యూ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల మందులు పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు.ప్రజలు వైరల్ ఫీవర్ను డెంగ్యూగా భావించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, డెంగ్యూ వ్యాధిని ఎన్ఎస్ఓ పరీక్ష ద్వారా మాత్రమే నిర్డారణ చేయడం జరుగుతుందన్నారు.

డెంగ్యూ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల మందులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు బయటి చికిత్సలు చేయించుకొని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు.విష జ్వరాన్ని డెంగ్యూగా భావించరాదని,ఎన్ఎస్ఓ టెస్టు అనంతరమే డెంగ్యూగా నిర్ధారణ చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే చెబుతుందన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందులతో పాటు 24గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారన్నారు.రోగులకు ఆహారంతో పాటు అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందని,ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని పొందాలన్నారు.

Advertisement

అనంతరం కలెక్టర్ ప్రతి వార్డు తిరుగుతూ ప్రతి రోగిని పలకరిస్తూ సమస్యలు తెలుసుకొని డాక్టర్లకు సూచనలు చేశారు.పేదలు వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ వారానికి రెండుసార్లు వచ్చి రోగుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం పట్ల రోగులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనరల్ ఆసుపత్రి ఇన్చార్జి సూపర్డెంట్ శ్రీకాంత్,జనార్దన్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Suryapet News