క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈరోజు థియేటర్ లో విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు.
ఈయన సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా ఫహాద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ తదితరులు నటించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తంశెట్టి మీడియాపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
మీరోస్లా కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ రోజు ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ: ఇందులో అల్లు అర్జున్, అజయ్ ఇద్దరు సవతి సోదరులు.దీంతో అల్లు అర్జున్ కు ఇంట్లో ప్రేమ, గౌరవం లేకపోయేసరికి అడవిలోకి వెళ్ళి పోతాడు.
అక్కడ భార్య భర్తలయిన సునీల్, అనసూయ ల దగ్గర పనిలో లారీ డ్రైవర్ గా చేరుతాడు.ఇందులో అల్లు అర్జున్ ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసి సునీల్ వాళ్లకు చేరవేస్తాడు.
అల్లు అర్జున్ తో పాటు మరికొంతమంది కూడా సునీల్ దగ్గర పని చేస్తారు.ఇక ఈ ఎర్రచందనంను సునీల్, అనసూయ, అనసూయ తమ్ముడు అక్రమంగా వాటిని అమ్ముకొని వాళ్లే వ్యాపారాలు చేసుకుంటారు.
అలా అల్లు అర్జున్ కి ఓ చోట రష్మిక మందన ఎదురవుతుంది.దీంతో వారి మధ్య లవ్ నడుస్తుంది.ఆ తర్వాత అల్లు అర్జున్ గ్యాంగ్ లో ఓ పని చేసే వ్యక్తి చనిపోవడంతో బాగా ఎమోషనల్ గా ఉంటుంది.దీంతో ఆ వ్యక్తిని చంపిన గ్యాంగ్ ను అల్లు అర్జున్ చంపేస్తాడు.
ఇక అక్కడున్న వాళ్లంతా అల్లు అర్జున్ ను గ్యాంగ్ లీడర్ గా చేసి పుష్ప రాజ్ గా పిలుస్తారు.ఇది నచ్చక సునీల్ పుష్ప రాజ్ ను చంపాలని చూస్తాడు.
ఇక సునీల్ పుష్పను చంపుతాడా లేదా అని మధ్యలో ఎదురయ్యే ట్విస్ట్ లు, ఇక ఫహద్ ఫాజిల్ ఎలా పరిచయం అవుతారు అనేది, చివరికి రష్మిక మందనను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలో చూడవచ్చు.
నటినటుల నటన: అల్లు అర్జున్ తన నటనతో ఎక్కడ కూడా తగ్గలేదు.రష్మిక మందన పల్లెటూరి అమ్మాయి గా కొత్త గెటప్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.సమంత తన స్టెప్పులతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.అనసూయ, సునీల్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్: టెక్నికల్ పరంగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్, సాంగ్స్, దేవిశ్రీ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ కూడా బాగా ఉంది.సుకుమార్ ఈ సినిమాకు మంచి కథను రూపొందించాడు.పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు.
విశ్లేషణ: సుకుమార్ కథను రొటీన్ పద్ధతిగా తీసిన కూడా అందులో కొత్తదనం కనిపించింది.దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ను అందించాడు.
సినిమా ట్విస్టులతో మాత్రం బాగా ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్, రష్మిక మందన పాత్రలు, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్, మ్యూజిక్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్, అద్భుతమైన క్లైమాక్స్, సమంత స్పెషల్ సాంగ్.
మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ కాస్త స్లో గా నడిచినట్లు అనిపించింది.
బాటమ్ లైన్: ఒక్కమాటలో చెప్పాలంటే మాస్ ఆడియేన్స్ పండగే!
రేటింగ్: 3/5