ఉద్యానవన తోటలను సాగు చేస్తున్న రైతులు పూత, పిందె సమయాలలో ఎలాంటి ఈ యాజమాన్య పద్ధతులను పాటించాలో ముందుగానే అవగాహన కల్పించుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.కొన్ని ఉద్యానవన తోటల్లో ఏడాది పొడవునా పూత వస్తుంది.
అయితే ఒక సీజన్లో మాత్రమే పూతను నిలబెట్టుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.అప్పుడే మంచి దిగుబడులు పొందవచ్చు.
దానిమ్మ పంటను( Pomegranate ) సాగు చేసే రైతులు జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే పూతను నిలుపుకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.మరి జనవరి లేదా ఫిబ్రవరిలో పూతను నిలబెట్టుకోవాలంటే.జూన్ నెల నుండి నీటి తడులు ఇవ్వడం ఆపేయాలి.దీంతో సెప్టెంబర్ వచ్చేసరికి దానిమ్మ చెట్లు బేట్టకు గురవుతాయి.అప్పుడు కొమ్మ కత్తిరింపులు జరపాలి.అక్టోబర్ నెలలో దానిమ్మ చెట్లకు ఎరువులు అందించి నీటి తడులు అందిస్తే డిసెంబర్ నెలలో చెట్లకు పూత వస్తుంది.
ఇక జనవరి, ఫిబ్రవరి మాసంలో దానిమ్మకాయలు ఏర్పడతాయి.దానిమ్మకాయల సైజు, నాణ్యత బాగా ఉండాలంటే చెట్లపై పూత పలుచగా ఉండాలి.
ఆరు సంవత్సరాల వయసు ఉండే చెట్లపై 40 నుంచి 50 కాయలు మాత్రమే ఉండేటట్లు, ఆరు సంవత్సరాల వయసు దాటిన మొక్కలపై 60 కాయల వరకు ఉండేటట్లు చూసుకోవాలి.
భూమిలో ఉండే తేమ శాతంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటే దానిమ్మకాయలో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది.దానిమ్మకాయ ఎదిగే దశలో ఒక కిలో కాల్షియం క్లోరైడ్( Calcium chloride ), ఒక కిలో మెగ్నీషియం క్లోరైడ్ ను 100 లీటర్ల నీటిలో కలిపి ఉచికారి చేయాలి.ఆ తరువాత 0.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్( Magnesium sulfate ), 1.5కిలోల DAP ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే కాయల పగుళ్లను నియంత్రించవచ్చు.దానిమ్మ పంటకు అవసరం అయినంత మేరకే నీటి తడులు అందించాలి.మీరు ఎక్కువగా అందిస్తే కొత్త చిగుర్లు ఎక్కువగా వచ్చి బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు ఉదృతం అవుతాయి.
సాగుకు ముందే సాగు చేసే విధానం పై అవగాహన ఉంటే నష్టం వాటినే అవకాశం ఉండదు.