డబ్బు కంటే విలువైంది ప్రాణం.కానీ నేడు లోకంలో ప్రాణం కంటే డబ్బునే విలువైనదిగా భావిస్తూ అజ్ఞానంలో బ్రతుకుతున్నారు మనుషులు.
మనీ అనేది ఎప్పుడైనా సంపాధించ వచ్చూ.కానీ ప్రాణం పోతే తిరిగి తీసుకు రావడం కష్టం.
ముఖ్యంగా వైద్యులు వైద్యం చేసే విషయంలో మాత్రం ఈ మాటలు తప్పని సరిగా గుర్తు పెట్టుకోవాలి.కానీ నేడు ఆ పరిస్దితులు లేవు.
ఇకపోతే ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల ధనదాహం కారణంగా ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.ఉత్తరప్రదేశ్, కౌశాంబి జిల్లాలోని మంజన్పూర్ పట్ణంలో నివసిస్తున్న మూడేళ్ల బాలికకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.కాగా ఆమెను పరీక్షించిన వైద్యులు చివరికి సర్జరీ చేశారు.
ఇక వారు అడిగినంత బిల్లు ఆ బాలిక తల్లిదండ్రులు చెల్లించక పోవడంతో ఆ వైద్యులు ఆపరేషన్ చేసిన ప్రదేశంలో కుట్లు వేయకుండా డిశ్చార్చ్ చేశారట.ఆ తర్వాత ఆ బాలిక పరిస్ది విషమంగా మారిందట.
ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేయగా, దీనిపై స్పందించిన ప్రయాగ్రాజ్ జిల్లా వైద్యాధారికారులు దర్యాప్తుకు ఆదేశించారట.