వేరుశనగ సాగులో మొవ్వ కుళ్ళు తెగులు నివారణ.. ఎరువుల యాజమాన్యం..!

వేరుశనగ సాగుకు ( Peanut cultivation ) ఇసుకతో కూడిన గరప నేలలు, ఎర్ర గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.వేసవిలో నేలను మెత్తగా లోతు దుక్కులు దున్ని చదును చేసుకోవాలి.

 Preventing The Root Rot In Peanut Cultivatio Ownership Of Fertilizers..! , Farm-TeluguStop.com

వేరుశనగ విత్తనాలను ఐదు మిల్లీలీటర్ల ఇథరిన్ మరియు 10 లీటర్ల నీటి ద్రావణంలో ఓ 10 గంటలు నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.ముఖ్యంగా విత్తనములను ఐదు సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి.

వ్యవసాయంలో ఎరువుల వాడకం ప్రధానమైనది.కాబట్టి రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులకు( Organic fertilizers) ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.ఒక ఎకరం పొలంలో 150 కిలోల వేప పిండి, 10 టన్నుల పశువుల ఎరువులను వేసి ఆఖరి దుక్కులో భూమిని కలియదున్నాలి.భూమిలో జింక్ లోపం లేకుండా ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ నువ్వు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Gypsum, Latest Telugu, Peanut, Peanuts

పంట వేసిన 30 రోజులకు ఒక ఎకరానికి 200 కిలో గ్రాముల జిప్సం( Gypsum ) ఎరువును మొక్కల మొదళ్ళ దగ్గర ఐదు సెంటీమీటర్ల లోతులో వేయాలి.పంట వేసిన 20 రోజుల తర్వాత నీటి తడులు అందించాలి.ఒకవేళ అవసరం ఉంటే పది రోజుల వ్యవధిలోనే నీటి తడులు అందిస్తే మంచిది.ఊడలు తిరిగే దశ నుండి కాయలు ఊరే వరకు రెండు లేదా మూడు తడులు నీటిని పారించాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Gypsum, Latest Telugu, Peanut, Peanuts

మొవ్వ కుళ్ళు తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఆకులపై వలయాల రూపంలో చారలు ఏర్పడి, ఆకులు చిన్నవిగా అయ్యి పాలిపోతాయి.మొవ్వు ఎండిపోయి కుళ్ళిపోతుంది.ఈ తెగుల ప్రభావం వేర్లు ఊడలు కాయల మీద పడి మొత్తం చెట్టు కుళ్ళిపోతుంది.

Telugu Agriculture, Farmers, Fertilizers, Gypsum, Latest Telugu, Peanut, Peanuts

కాబట్టి తెగుళ్లను తట్టుకునే విత్తనాలను ఎంచుకోవాలి.కదిరి -3, ఆర్ 8808, వేమన వంటి రకాలను ఎత్తుకోవాలి.విత్తనాలు నాటిన 20 రోజుల తర్వాత రెండు మిల్లీలీటర్ల నీటిలో ఒకటి పాయింట్ 6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను మొక్క మొత్తం తడిచేలాగా పిచ్చికారి చేస్తే తామర పురుగులు పంటను ఆశించకుండా సంరక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube