వేరుశనగ సాగులో మొవ్వ కుళ్ళు తెగులు నివారణ.. ఎరువుల యాజమాన్యం..!
TeluguStop.com
వేరుశనగ సాగుకు ( Peanut Cultivation ) ఇసుకతో కూడిన గరప నేలలు, ఎర్ర గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
వేసవిలో నేలను మెత్తగా లోతు దుక్కులు దున్ని చదును చేసుకోవాలి.వేరుశనగ విత్తనాలను ఐదు మిల్లీలీటర్ల ఇథరిన్ మరియు 10 లీటర్ల నీటి ద్రావణంలో ఓ 10 గంటలు నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ముఖ్యంగా విత్తనములను ఐదు సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి.వ్యవసాయంలో ఎరువుల వాడకం ప్రధానమైనది.
కాబట్టి రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులకు( Organic Fertilizers) ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఒక ఎకరం పొలంలో 150 కిలోల వేప పిండి, 10 టన్నుల పశువుల ఎరువులను వేసి ఆఖరి దుక్కులో భూమిని కలియదున్నాలి.
భూమిలో జింక్ లోపం లేకుండా ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ నువ్వు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
"""/" /
పంట వేసిన 30 రోజులకు ఒక ఎకరానికి 200 కిలో గ్రాముల జిప్సం( Gypsum ) ఎరువును మొక్కల మొదళ్ళ దగ్గర ఐదు సెంటీమీటర్ల లోతులో వేయాలి.
పంట వేసిన 20 రోజుల తర్వాత నీటి తడులు అందించాలి.ఒకవేళ అవసరం ఉంటే పది రోజుల వ్యవధిలోనే నీటి తడులు అందిస్తే మంచిది.
ఊడలు తిరిగే దశ నుండి కాయలు ఊరే వరకు రెండు లేదా మూడు తడులు నీటిని పారించాలి.
"""/" /
మొవ్వ కుళ్ళు తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఆకులపై వలయాల రూపంలో చారలు ఏర్పడి, ఆకులు చిన్నవిగా అయ్యి పాలిపోతాయి.మొవ్వు ఎండిపోయి కుళ్ళిపోతుంది.
ఈ తెగుల ప్రభావం వేర్లు ఊడలు కాయల మీద పడి మొత్తం చెట్టు కుళ్ళిపోతుంది.
"""/" /
కాబట్టి తెగుళ్లను తట్టుకునే విత్తనాలను ఎంచుకోవాలి.కదిరి -3, ఆర్ 8808, వేమన వంటి రకాలను ఎత్తుకోవాలి.
విత్తనాలు నాటిన 20 రోజుల తర్వాత రెండు మిల్లీలీటర్ల నీటిలో ఒకటి పాయింట్ 6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను మొక్క మొత్తం తడిచేలాగా పిచ్చికారి చేస్తే తామర పురుగులు పంటను ఆశించకుండా సంరక్షించుకోవచ్చు.
శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితే బెటర్.. ఆ రేంజ్ లో ఎవరూ ఖర్చు చేయరంటూ?