మొక్కజొన్నను తెగుళ్ల, పురుగుల నుండి రక్షించే సస్యరక్షణ పద్ధతులు..!

భారతదేశంలో పండించే వాణిజ్య పంటలలో ప్రముఖమైనదిగా మొక్కజొన్న పంటను చెప్పుకోవచ్చు.రైతులు ఎక్కువగా మిగతా పంటల కంటే మొక్కజొన్న పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

 Plant Protection Methods To Protect Corn From Pests And Insects, Corn , Seed Tre-TeluguStop.com

పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్న శ్రమ విషయానికి వస్తే మొక్కజొన్న పంట చాలా బెటర్.మొక్కజొన్న పంటకు కత్తెర పురుగుల బెడద విపరీతంగా ఉంటుంది.

మొదట్లోనే ఈ కత్తెర పురుగులను గుర్తించి అరికట్టకపోతే పంట నష్టం ఊహించని రీతిలో ఉంటుంది.ఇందుకోసం తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

పంట ఏదైనా సరే ముందుగా విత్తన శుద్ధి తప్పనిసరి.ముందుగా మొక్కజొన్న విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తనాలు నాటిన 20 రోజుల తర్వాత పురుగులు పంటను ఆశించే అవకాశాలు ఉండవచ్చు.10,000 పీపీఎం వేప నూనెను ఎకరాకు 200 ఎంఎల్ చొప్పున పిచికారి చేయాలి.

పంట వేసిన 15 నుండి 20 రోజుల మధ్యలో మొక్కజొన్న పంటకు పురుగుల బెడద చాలా ఎక్కువ.లేత మొక్కజొన్న ఆకులను లబ్ది పురుగులు ఆశించడంతో, ఆకులు వలయాకారంలో మారి సూర్యరశ్మి అందక ఎండిపోతాయి.కాబట్టి డెలిగేట్ ను ఎకరాకు 100 మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి.భూమిని లోతుగా దుక్కి దున్నడం ద్వారా నేలలోని కత్తెర పురుగులు నిద్రావస్థ దశలోనే చనిపోతాయి.

మిగిలిన పురుగులను పక్షులు తినేస్తాయి.ఈ పురుగులు ఒకేసారి 1500 నుంచి 2000 గుడ్లు పెడతాయి.

వీటిని నాశనం చేసిన తర్వాతేనే పంట వేసుకోవాలి.పైగా దుక్కి దున్నడం ద్వారా వర్షపు నీరు అధికంగా ఇంకి పైరుకు బెట్ట తగలకుండా ఉంటుంది.1 కేజీ మొక్కజొన్న విత్తనాలకు,4 మి.లీ ల సయంట్రానిలి ప్రోలం థయామిథాక్సమ్‌ తో శుద్ధి చేసుకుని 24 గంటల తరువాత విత్తు కోవాలి.ఈ పద్ధతులను సరియైన క్రమంలో పాటిస్తే పురుగుల బెడద నుండి పంటను సంరక్షించుకోవచ్చు.అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube