బుల్లితెర యాంకర్ రష్మీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆమెకు సినిమా ఆఫర్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.రష్మీ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి.
జంతువులపై రష్మీకి ఉండే ప్రేమ అంతాఇంతా కాదు.జంతువులకు ఏ చిన్న కష్టం వచ్చినా రష్మీ అస్సలు తట్టుకోలేరు.
అయితే కొన్నిరోజుల క్రితం వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందగా ఈ ఘటన విషయంలో రష్మి సైతం సంతాపం తెలియజేశారు.అయితే ఈ ఘటన జరిగిన తర్వాత రష్మీని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.
కొంతమంది రష్మీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.అయితే తాజాగా ఒక నెటిజన్ రష్మీని అరెస్ట్ చేయాలని కామెంట్ చేయడం గమనార్హం.

వీధి కుక్కలకు ఆహారం పెడుతూ మనపై వాటి దాడిని ప్రోత్సహిస్తున్న్ రష్మీ గౌతమ్ ను అరెస్ట్ చేయాలని ఒక నెటిజన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ గురించి రష్మీ స్పందిస్తూ అది అంత సులువు కాదు నీకు నచ్చింది చేసుకో అని చెప్పుకొచ్చారు.నెటిజన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.రష్మీపై ఇంత ద్వేషం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు.

రష్మీపై ద్వేషం తగ్గించుకోవాలని ఏ తప్పు చేయని సెలబ్రిటీలను ఇలా టార్గెట్ చేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.రష్మీ పారితోషికం రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో ఉంది.
స్టార్స్ సినిమాలతో పాటు చిన్న సినిమాలలో కూడా రష్మీకి అవకాశాలు వస్తున్నాయి.కెరీర్ విషయంలో రష్మీ జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం.







