రవాణాశాఖ కార్యాలయం లో దాడి చేసిన వ్యక్తి రిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంగళవారం రోజు ఉదయం రవాణా శాఖ రాజన్న సిరిసిల్లా జిల్లా మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీదర్ రెండు బూడిద తరలించే వాహనాలను అధిక బరువుతో వెళ్తున్నందున వాహనాలకు కేస్ చేసి బస్సు డిపోకి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న వాహనాల యజమాని అదే రోజు సాయంత్రం మద్యం తాగి వచ్చి రవాణాశాఖ కార్యాలయం పైన దాడికి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్యాలయ ఉద్యోగుల పై దుర్భషాలాడి కార్యాలయ సిబ్బంది కానిస్టేబుల్ ప్రశాంత్ ను గాయపరిచిన వ్యక్తి పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలముకు చెందిన రౌతు నాగరాజు తండ్రి కనుకయ్య ను గురువారం రోజు సాయంత్రం రిమాండ్ కు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.

ఈ సంఘటన పై తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్త పరుస్తూ మా ఉద్యోగ భద్రత పైన శ్రద్ధ వహించిన అధికారులకు నాయకులకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కాకుండా ఉండాలని   తెలియజేశారు.

Person Who Attacked The Office Of The Transport Department Was Remanded, Transp
వీడియో: జీరో గ్రావిటీలో జపాన్ ఆస్ట్రోనాట్ బేస్‌బాల్.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే..

Latest Rajanna Sircilla News