పవన్ కీలక నిర్ణయం ! వారికి అసలు సిసలు సినిమా చూపిస్తారా ? 

ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )డిసైడ్ అయిపోయారు.ఇప్పటివరకు అప్పుడప్పుడు మాత్రమే ఏపీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతూ వైసిపి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్న పవన్,  ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నారు.

 Pawan's Key Decision Will You Show Them The Original Sisalu Movie , Pavan Kaly-TeluguStop.com

టిడిపి( TDP ) తో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు .ఇప్పటి వరకు పవన్ ఏపీలో పూర్తిస్థాయిలో పర్యటించలేకపోవడానికి కారణం  సినిమాలలో బిజీగా ఉండడమే.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Telugudesam, Varahi

దీంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించాలని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నిర్ణయించుకున్నారు.ఈ మేరకు దర్శక నిర్మాతలకు ఈ విషయంపై సమాచారం పంపించారట .క్యాడర్ ను సైతం దీనికోసం సిద్ధం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశాన్ని పవన్ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి .డిసెంబర్ 1న పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఏపీ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో  ఏ విధమైన వ్యూహాలను అనుసరించాలనే విషయం పైన పార్టీ నాయకులకు పవన్ దిశా నిర్దేశం చేయబోతున్నారట.ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లడం వంటి అంశాల పైన పార్టీ నేతలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Telugudesam, Varahi

 అలాగే వారాహి యాత్ర ( Varahi Yatra )ను మళ్లీ మొదలు పెడితే ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే విషయం పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.ఒక వైపు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూనే , మరోవైపు వైసీపీ ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తూ నిరంతరం సభలు,  సమావేశాలు,  రోడ్డు షోలు నిర్వహించి బలమైన శక్తిగా ఏపీలో ఎదగడంతో పాటు, రాబోయే రోజుల్లో జనసేనకు తిరుగులేకుండా చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు మొదలు పెట్టారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube