పవన్ టార్గెట్ "పవరే " ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) చేపట్టిన వారాహి విజయయాత్ర హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.ఈ యాత్రలో భాగంగా పవన్ చేసున్న వ్యాఖ్యలు అటు ప్రత్యర్థి పార్టీ నేతలను, ఇటు జనసైనికులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

 Pawan's Focus On The Post , Pawan, Janasena, Pawan Kalyan, Ycp, Chandrababu, And-TeluguStop.com

పదవుల కోసం కాదని కేవలం ప్రశ్నించడానికే అని మొదటి నుంచి చెబుతున్నా పవన్.ఆ మద్య తన వైఖరి మార్చుకొని సి‌ఎం పదవే టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు.

కానీ మళ్ళీ అంతలోనే పదవుల కోసం తాను పాకులాడనని.పదవులే తనను వరించి రావాలని ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ వచ్చారు.

దీంతో పదవి విషయంలో ఇంతకీ పవన్ మనసులో ఏముందో తెలియక సామాన్యులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Chandrababu, Janasena, Pawan, Pawan Kalyan, Pawans-Po

కాగా వైసీపీ ( YCP )ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తులకు సై అన్న పవన్ టీడీపీతో కలవడం దాదాపు ఖాయం చేసుకున్నారు.దీంతో ఈ పొత్తు అధికారికంగా ప్రకటిస్తే.అందరిమనసులో మెదిలే ఒకటే ప్రశ్న.

ఈ కూటమి యొక్క సి‌ఎం అభ్యర్థి ఎవరనేది.అటు చంద్రబాబు( Chandrababu ), ఇటు పవన్ ఇద్దరు కూడా సి‌ఎం పదవి కోసం గట్టిగానే నిలబడుతున్నారు.

ఈ నేపథ్యంలో సి‌ఎం అభ్యర్థి విషయంలో ఈ రెండు పార్టీల మద్య దూరం పెరిగి ఎవరికి వారే అన్నట్లుగా ఎన్నికల బరిలోకి దిగుతారా ? అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.ఎందుకంటే వారాహి యాత్రలో భాగంగా పవన్ తరచూ సి‌ఎం పదవి గురించి పెదవి విప్పుతున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Chandrababu, Janasena, Pawan, Pawan Kalyan, Pawans-Po

తనకు సి‌ఎం గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని, అవినీతి, రౌడీలు, గూండాలు లేని శురక్ష ఆంద్రప్రదేశ్( Andhra Pradesh ) ను తయారు చేస్తానని గంటాపథంగా చెబుతూ వస్తున్నారు.ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే సి‌ఎం పదవి విషయంలో పవన్ స్పష్టమైన ఎజెండాతో ఉన్నట్లు అర్థమౌతోంది.మరి పవన్ సి‌ఎం పదవిపై ఈ స్థాయిలో పట్టుదలగా ఉంటే.చంద్రబాబు పదవి విషయంలో వెన్నక్కి తగ్గుతారా ? అనేది కూడా అంతుచిక్కని ప్రశ్నే.అయితే విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఇద్దరు అధినేతలు సి‌ఎం పదవిని చెరో రెండున్నర ఏళ్ళు పంచుకునే అవకాశం ఉందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.మొత్తానికి ప్రశ్నించడమే తమ మొదటి లక్ష్యం అని బరిలోకి దిగిన పవన్ ఇప్పుడు పవరే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube