గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.( Ustaad Bhagat Singh ) చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈమధ్యనే షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ షెడ్యూల్ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చేసారు.ఈ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతూ ఉంది.ఈ షెడ్యూల్ 12 వ తారీఖున ప్రారంభం అయ్యింది.16 వ తారీఖు వరకు సాగింది.ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కొద్దీ రోజులు షూటింగ్ ఆగింది.
ఇప్పుడు మళ్ళీ 26 వ తారీఖున ప్రారంభం అయ్యింది.
ఈ నెలాఖరు వరకు విరామం లేకుండా కొనసాగే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు.ఇక నిన్న షూటింగ్ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయితే, అర్థరాత్రి 12 వరకు కొనసాగింది.వాస్తవానికి నిన్న శ్రీలీల షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.
కానీ ఆమెకి అదే సమయం లో ‘గుంటూరు కారం’ సినిమా( Guntur Karam Movie ) షూటింగ్ కూడా ఉండడం తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ కి రాలేకపోయింది.కానీ సాయంత్రం సమయానికి ‘గుంటూరు కారం’ షూటింగ్ అయిపోవడం తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ కి వచ్చింది.
రాత్రి 9 గంటలకు ఆమెకి సెట్స్ లోకి అడుగుపెట్టగా, అర్థరాత్రి 2 గంటల వరకు షూటింగ్ జరిగింది.పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు.
అలా శ్రీలీల( Sreeleela ) కోసం అంత సేపు వేచి చూసాడంటే పవన్ కళ్యాణ్ కి పని పట్ల ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆక్టోబర్ 1 వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’( Varahi Vijaya Yatra ) లో పాల్గొన బోతున్నాడు.కృష్ణ జిల్లాలో ప్రారంభం అయ్యే ఈ యాత్ర తర్వాత మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికే డేట్స్ కేటాయించాడని టాక్.ఎలా అయినా ఈ సినిమాని ఈ ఏడాది లోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మరి ఈ చిత్రానికి టికెట్ రేట్స్ ఉంటాయో ఉండవో తెలియదు కానీ, ఒకవేళ రేట్స్ రాకపోతే ఎన్నికల తర్వాత విడుదల అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.