తెలుగుదేశానికి హెచ్చరికగా పవన్ తీరు??

రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం కలిసి నడవాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముందుగా కలిసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ).విశాఖపట్నంలో పవన్ సభను అడ్డుకున్న సంఘటన తర్వాత ఆయనకు మద్దతు తెలపడానికి పవన్ కళ్యాణ్ ను కలిసిన చంద్రబాబు వైసిపి అరాచక పాలన అడ్డుకోవాలంటే కలిసి నడవాల్సిన అవసరం ఉందన్న ప్రతిపాదన చేశారు .

 Pavan Indirect Warning To Tdp?, Pawan Kalyan, Tdp, Chandra Babu Naidu , Ap Polit-TeluguStop.com

క్రియాశీలక రాజకీయాల దిశగా ముందుకు వెళ్దాం అంటూ ఆఫర్ ఇచ్చారు.అప్పటి వైసిపి తీరుపై పూర్తిస్థాయి ఆగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాథమికంగా దానికి అంగీకరించారు .తర్వాత అనేక చర్చలు సమావేశాలు తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కలసి నడవాలన్న అంగీకారానికి వచ్చారని చెబుతారు .

Telugu Ap, Chandra Babu, Jana Sena, Modi, Pawan Kalyan, Visakhapatnam, Ys Jagan-

అయితే తర్వాత జరిగిన అనేక సంఘటనల తో తెలుగుదేశం పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది ఎమ్మెల్సీ ఎన్నికల పలితాల తర్వాత ఒంటరిగా అధికారంలోకి వస్తామన్న ధీమా ఆ పార్టీ నేతలలో పెరిగినట్లుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి మద్దతు ఇస్తామని చెప్పిన జనసేన వ్యాఖ్యలపై ఏ రకమైన స్పందన కానీ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ని విమర్శిస్తున్న అధికార పార్టీ నేతలపై ఏ రకమైన విమర్శలు గాని ,తెలుగుదేశం నాయకులు నుంచి రాలేదు.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కీలకమైన మహానాడు సమావేశాలలో కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ పొత్తులపై ముందుకు వెళ్తున్నామన్న సంకేతాలు గాని ఆ పార్టీ ఇవ్వలేదు .తద్వారా తమను చిన్న చూపు చూస్తున్నారని, తమ పట్ల లెక్క లేనట్లుగా వ్యవహరిస్తున్నారు అన్న ఆవేదన జనసైనికుల లో ఏర్పడింది.అంతేకాకుండా తమ అనుకూల మీడియా ద్వారా 20 సీట్లు ఇస్తామని 25 సీట్లు ఇస్తామని పీలర్లు కూడా వదిలారు.

ఇది జనసేన ఇమేజ్కు డామేజ్ చేస్తుందన్న అభిప్రాయాలు నడుమ తన పర్యటనతో వాటన్నిటికీ పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Modi, Pawan Kalyan, Visakhapatnam, Ys Jagan-

మీరు నన్ను పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని అసలు లెక్క చేయనున్న తరహాలో ఆయన కత్తిపూడి వేదిక గా జరిగిన బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చారు .తనకు మాత్రమే అవకాశం ఇవ్వాలని తాను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తిరగరాస్తానంటూ చేసిన వ్యాఖ్యల వ్యాఖ్యలలో ఎక్కడా తెలుగుదేశం ప్రస్తావని తీసుకు రాకపోవడం ద్వారా ఒంటరిగానైనా తాను పోటీ చేస్తానన్న సంకేతాలను ఆయన ఇచ్చేశారు.ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిక గానే చూడాల్సి ఉంటుంది .ఒక అడుగు ముందుకు వేసినందుకు తనను చిన్నచూపు చూస్తే మరొకసారి 2019 నాటి ఫలితాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న హెచ్చరికను తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది , డబ్బుతో రాజకీయాలు చేయని జనసేనకు( Jana sena ) మరో అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉండే సత్తా ఉంది కానీ మరొకసారి తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే మాత్రం తన రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితుల్లో పొత్తులు జనసేన కన్నా తెలుగుదేశం ప్రభుత్వానికే ఎక్కువ అవసరం తమను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న హెచ్చరికను పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన బహిరంగ సభ కేంద్రం గా స్పష్టం చేశారని చెప్పవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube