తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఈ మేరకు జాతీయ నేతలు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా నారాయణపేటలో బీజేపీ నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదని చెప్పారు.
అంతేకాకుండా ధరణి పోర్టల్ తీసుకువచ్చి పేదల భూములను సైతం కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.