సాధారణంగా ఒకటి లేదా రెండుసార్లు ఫెయిల్ అయితే చాలామంది నిరాశ, నిస్పృహలకు లోనావుతారు.వరుసగా మూడుసార్లు ఫెయిల్యూర్ ఎదురైతే మళ్లీ ప్రయత్నించడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపరు.
సొంత ప్రిపరేషన్ తో ఐఏఎస్( IAS ) కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సులువు కాదు.మూడుసార్లు సృజనకు( IAS Srijana ) ఫెయిల్యూర్ ఎదురు కాగా చివరి ప్రయత్నంలో సృజన లక్ష్యాన్ని సాధించారు.
గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా సృజన చివరి ప్రయత్నంలో 44వ ర్యాంక్ సాధించారు.సృజన తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కాగా తండ్రిని స్పూర్తిగా తీసుకున్న సృజన 2007 సంవత్సరంలో సివిల్స్ ప్రిపరేషన్( Civils ) మొదలుపెట్టారు.
నాలుగో ప్రయత్నంలో సైకాలజీ బదులు ఫిలాసపీని ఎంచుకున్న సృజన స్వీయ ప్రణాళికతో సక్సెస్ సాధించారు.రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివి సృజన సక్సెస్ అయ్యారు.
మూడుసార్లు ఫెయిల్యూర్ ఎదురైనా ఒత్తిడికి గురి కాలేదని కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడంతో సృజన అనుకున్న లక్ష్యాన్ని సాధించానని వెల్లడించారు.గ్రూప్1 జాబ్( Group 1 ) చేస్తూనే ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని సృజన చెప్పుకొచ్చారు.అమ్మ పూడి గ్రామ సర్పంచ్ గా ఉన్నారని ఆమె తెలిపారు.ఐఏఎస్ ఆఫీసర్ గా ( IAS Officer ) ఎంపికైతే 30 ఏళ్ల పాటు ప్రజా సేవ చేయవచ్చని సృజన కామెంట్లు చేశారు.
ఏకాగ్రతతో నిజాయితీగా కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని అన్నారు.పదో తరగతిలో 520 మార్కులు సాధించిన సృజన ప్రస్తుతం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.సృజనకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.సృజన పలు సందర్భాల్లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు.నా సక్సెస్ లో భర్తకు కూడా భాగం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఒకప్పుడు తండ్రిని స్పూర్తిగా తీసుకున్న సృజన ఇప్పుడు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
సృజన టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.